Vinesh Phogat: వినేష్ ఫొగట్, భ‌జ‌రంగ్ పూనియా రాజీనామాలకు రైల్వేశాఖ‌ ఆమోదం

రెజ్లర్లు వినేష్ ఫొగట్, భజరంగ్ పూనియాలు తమ రైల్వే ఉద్యోగాలకు రిజైన్ చేసి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

Update: 2024-09-09 15:24 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రెజ్లర్లు వినేష్ ఫొగట్, భజరంగ్ పూనియాలు తమ రైల్వే ఉద్యోగాలకు రిజైన్ చేసి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వారి రాజీనామాలను రైల్వే శాఖ సోమవారం ఆమోదించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు. మూడు నెలల నోటీసు వ్యవధిని సైతం ఎత్తివేసినట్టు వెల్లడించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం అక్టోబర్ 5న జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత సాధించేందుకు వినేష్ అధికారికంగా రైల్వే శాఖ నుంచి రిలీవ్ కావాల్సి ఉంది. తాజాగా రాజీనామాలను ఆమోదించడంతో ఫొగట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు కలుగుతుంది. ఉద్యోగులందరూ తప్పనిసరిగా పాటించాల్సిన 3 నెలల నోటీసు పీరియడ్ నిబంధన కారణంగా వినేష్ ఫొగట్ ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నారనే ఊహాగానాలు వెలువడిన నేపథ్యంలో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకోడం గమనార్హం. కాగా, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఫొగట్, భజరంగ్ పూనియాలు పోటీ చేయనున్న విషయం తెలిసిందే. జులనా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వినేష్ బరిలోకి దిగనుండగా..భజరంగ్‌కు ఇంకా టికెట్ ఖరారు కాలేదు. 


Similar News