ప్రియాంక వద్దకు చేరిన ‘హిమాచల్ సంక్షోభం’.. విక్రమాదిత్య భేటీ

దిశ, నేషనల్ బ్యూరో : హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్ చకచకా పావులు కదుపుతున్నారు.

Update: 2024-03-04 12:42 GMT

దిశ, నేషనల్ బ్యూరో : హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్ చకచకా పావులు కదుపుతున్నారు. సీఎం సుఖుపై కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఫిర్యాదులు చేయడంపై ఆయన ఫోకస్ పెట్టారు. ఈక్రమంలోనే ఆదివారం సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు ప్రియాంకా గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్‌‌లను విక్రమాదిత్య సింగ్ కలిశారు. దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ భేటీలో హిమాచల్‌ప్రదేశ్‌‌లోని పరిస్థితులను వారికి ఆయన వివరించారు. ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు సీఎంకు వ్యతిరేకంగా లేవనెత్తిన అంశాలను ప్రియాంక, వేణుగోపాల్‌‌ల దృష్టికి తీసుకెళ్లారు. తన తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌ విగ్రహం ఏర్పాటుకు కనీసం స్థలాన్ని కేటాయించకుండా అవమానకరంగా సీఎం వ్యవహరిస్తున్నారని విక్రమాదిత్య ఆరోపించినట్లు తెలిసింది. త్వరలోనే ఆయన కొత్త పార్టీని ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News