Vikram Misri: విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పదవీ కాలం పొడిగింపు.. ఉత్వర్వులు జారీ చేసిన కేంద్రం

భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పదవీ కాలాన్ని 2026 జూలై 14 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది.

Update: 2024-11-11 16:31 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ (Vikram Misri) పదవీ కాలాన్ని 2026 జూలై14 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు సోమవారం ఉత్వర్వులు జారీ చేసింది. ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న మిస్రీ పదవీ కాలాన్ని రెండేళ్ల పాటు పొడిగిస్తున్నట్టు తెలిపింది. కేబినెట్ నియామకాల కమిటీ దీనికి ఆమోదించినట్టు వెల్లడించింది. ప్రజా ప్రయోజనాల దృష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. FR 56 (d) నిబంధనల ప్రకారం పదవీ కాలాన్ని పెంచినట్టు తెలిపింది. కాగా, 1989 ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) బ్యాచ్‌కు చెందిన మిస్రీ ఈ ఏడాది జూలై 15న విదేశాంగ కార్యదర్శిగా బాద్యతలు చేపట్టారు. మిస్రీ ప్రస్తుత పదవీకాలం నవంబర్ 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఆయన పదవీ కాలాన్ని రెండేళ్ల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో అనేక పదవుల్లో పనిచేశారు. గతంలో మిస్రీ యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఉత్తర అమెరికాలోని భారతీయ మిషన్లలో వివిధ హోదాల్లో పని చేశారు.

Tags:    

Similar News