CM Yogi :తోడేళ్ల కలకలం.. బహ్రయిచ్‌లో సీఎం యోగి.. కీలక ఆర్డర్స్

దిశ, నేషనల్ బ్యూరో : గత రెండు నెలల్లో తోడేళ్ల గుంపులు జరిపిన వరుస దాడులతో చిగురుటాకులా వణికిపోయిన ఉత్తరప్రదేశ్‌లోని బహ్రయిచ్ జిల్లాలో సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యటించారు.

Update: 2024-09-15 18:54 GMT

దిశ, నేషనల్ బ్యూరో : గత రెండు నెలల్లో తోడేళ్ల గుంపులు జరిపిన వరుస దాడులతో చిగురుటాకులా వణికిపోయిన ఉత్తరప్రదేశ్‌లోని బహ్రయిచ్ జిల్లాలో సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యటించారు. ఈ దాడులతో ప్రభావితమైన కుటుంబాల వారిని ఆయన ఆదివారం పరామర్శించారు. ఈ జిల్లాలోని వేర్వేరు చోట్ల జరిగిన తోడేళ్ల దాడుల్లో 9 మంది చనిపోగా, దాదాపు 50 మందికి గాయాలయ్యాయి. బాధిత కుటుంబాలన్నింటికి అండగా నిలుస్తామని సీఎం యోగి ఈసందర్భంగా హామీ ఇచ్చారు.

తోడేళ్లను ఏరిపారేసే దాకా ‘ఆపరేషన్ భేడియా’ను ఆపొద్దని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ‘‘ఆహారం కోసం అన్వేషిస్తూ తోడేళ్లు అడవులను దాటేసి జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. సరయూ నదిలో నీటిమట్టం పెరగడంతో జులై 17న కూడా తోడేళ్లు ప్రజలు నివసించే ప్రదేశాల్లోకి ఎంటరయ్యాయి’’ అని సీఎం యోగి వివరించారు. ఈ పరిస్థితిని అదుపులోకిి తెచ్చేందుకే తోడేళ్లు కనిపిస్తే కాల్చేయాలనే ఆదేశాలను తమ ప్రభుత్వం జారీ చేసిందని ఆయన గుర్తుచేశారు. ఈ దాడుల నేపథ్యంలో బహ్రయిచ్ జిల్లాలో యాంటీ రేబిస్ వీనం స్టాక్‌ లభ్యతను పెంచామని ముఖ్యమంత్రి తెలిపారు.


Similar News