Upsc ssc : ఆ రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో పేపర్ లీక్‌లు లేవు.. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

గత రెండేళ్లుగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ , రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో పేపర్ లీకేజీకి సంబంధించిన ఘటనలేవీ జరగలేదని కేంద్ర ప్రభుత్వం గురువారం రాజ్యసభలో వెల్లడించింది.

Update: 2024-07-25 13:58 GMT

దిశ, నేషనల్ బ్యూరో: గత రెండేళ్లుగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ), రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్ఆర్‌బీ), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) నిర్వహించిన రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో పేపర్ లీకేజీకి సంబంధించిన ఘటనలేవీ జరగలేదని కేంద్ర ప్రభుత్వం గురువారం రాజ్యసభలో వెల్లడించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇటీవల జరిపిన పరీక్షలోనే కొన్ని పొరపాట్లు జరిగాయని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. దీనికి సంబంధించి కేసులు నమోదయ్యాయని, అలాగే సమగ్ర దర్యాప్తు కోసం ఈ అంశంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించట్టు పేర్కొన్నారు. పబ్లిక్ పరీక్షల్లో అవకతవకలను అరికట్టడానికి పబ్లిక్ ఎగ్జామినేషన్ ఆక్ట్ 2024ని అమలులోకి తెచ్చినట్టు చెప్పారు. మరోవైపు బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాత్మక ఘర్షణల దృష్యా దాదాపు 6,700 మంది భారతీయ విద్యార్థులు బంగ్లాదేశ్ నుంచి తిరిగి వచ్చినట్టు కేంద్ర విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు.

Tags:    

Similar News