ఆర్మీ వైస్ చీఫ్‌గా ఉపేంద్ర ద్వివేదీ

ఇండియన్ ఆర్మీ కొత్త వైస్ చీఫ్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేదీ సోమవారం బాధ్యతలు చేపట్టారు. లెఫ్టినెంట్ జనరల్ ఎంవీ సుచీంద్ర కుమార్ స్థానంలో ఆయన నియమితులయ్యారు.

Update: 2024-02-19 09:47 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇండియన్ ఆర్మీ కొత్త వైస్ చీఫ్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేదీ సోమవారం బాధ్యతలు చేపట్టారు. లెఫ్టినెంట్ జనరల్ ఎంవీ సుచీంద్ర కుమార్ స్థానంలో ఆయన నియమితులయ్యారు. ద్వివేదీ గతంలో నార్తర్న్ ఆర్మీ కమాండర్‌గా విధులు నిర్వర్తించారు. మరోవైపు సుచీంద్ర ఉధంపూర్ నార్తర్న్ కమాండ్ ఆఫీసర్‌గా నియామకమయ్యాడు. బాధ్యతలు చేపట్టే ముందు ద్వివేదీ నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. కాగా, ద్వివేది మధ్యప్రదేశ్ సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థి.1984 డిసెంబర్ 15న జమ్మూ అండ్ కశ్మీర్ రైఫిల్స్ 18వ బెటాలియన్‌లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత కశ్మీర్, రాజస్థాన్‌లలో కమాండ్ ఆఫీసర్‌గా పని చేశారు. అంతేగాక అస్సాం రైఫిల్స్ బెటాలియన్‌లోనూ విధులు చేపట్టారు. తన పదవీ కాలంలో చైనా, పాక్ సరిహద్దుల వెంబడి ఉగ్రవాద కార్యకలాపాలను నియంత్రించడంలో సరైన కార్యాచరణను అమలు చేశారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే మే 31న పదవీ విరమణ చేస్తే.. తదుపరి ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది ముందు వరుసలో ఉండటం గమనార్హం.

Tags:    

Similar News