Kidnap : డేటింగ్‌కు పిలిచి వ్యక్తి కిడ్నాప్.. పోలీసుల ఎంట్రీతో..
దిశ, నేషనల్ బ్యూరో : ఓ మహిళ ఫోన్ చేసి ‘‘డేటింగ్ చేద్దాం రా’’ అని పిలవడంతో ఉత్తరప్రదేశ్(UP)లోని లలిత్‌పూర్‌కు చెందిన 50 ఏళ్ల లల్లూ చౌబే(Lallu Chaubey) వెంటనే ఓకే చెప్పాడు.
దిశ, నేషనల్ బ్యూరో : ఓ మహిళ ఫోన్ చేసి ‘‘డేటింగ్ చేద్దాం రా’’ అని పిలవడంతో ఉత్తరప్రదేశ్(UP)లోని లలిత్‌పూర్‌కు చెందిన 50 ఏళ్ల లల్లూ చౌబే(Lallu Chaubey) వెంటనే ఓకే చెప్పాడు. ఆమె చెప్పిన విధంగా.. రాష్ట్రంలోని ఝాన్సీలో ఉన్న ఒక లొకేషన్‌కు వెళ్లిపోయాడు. అక్కడ లల్లూను కలిసిన ఇద్దరు వ్యక్తులు.. ఫోన్ చేసిన మహిళను కలిపిస్తామంటూ తీసుకెళ్లి అతగాడిని కిడ్నాప్(Kidnap) చేశారు. గత గురువారం (నవంబరు 7) నుంచి శనివారం వరకు కిడ్నాపర్ల చెరలోనే లల్లూ ఉన్నాడు. ఈక్రమంలో కిడ్నాపర్లు లల్లూ కొడుకుకు ఫోన్ చేశారు. రూ.3 లక్షలు ఇస్తేనే లల్లూను వదులుతామని డిమాండ్ చేశారు. దీంతో భయపడ్డ లల్లూ కొడుకు వెంటనే ఫోనులో వారికి రూ.1 లక్ష పంపాడు.
అయితే మిగతా రూ.2 లక్షలు కూడా ఇవ్వాల్సిందేనని కిడ్నాపర్లు డిమాండ్ చేశారు. దీంతో అతడు దీని గురించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ప్రత్యేక టీమ్‌ను ఝాన్సీకి పంపగా.. దానిలోని ఒక కానిస్టేబుల్ తానే లల్లూ కొడుకును అంటూ కిడ్నాపర్లకు కాల్ చేశాడు. తన తండ్రిని అప్పగిస్తే మిగతా రూ.2 లక్షలు ఇస్తానన్నాడు. ఇది నిజమేనని భావించిన కిడ్నాపర్లు.. లల్లూ చౌబేను దాచిన ప్లేసుకు కానిస్టేబుల్‌ను తీసుకెళ్లారు. వారిని ఫాలో అయిన పోలీసు టీమ్.. కిడ్నాపర్లను అదుపులోకి తీసుకొని, లల్లూను విడిపించింది. ఇద్దరు కిడ్నాపర్లు, లల్లూకు ఫోన్ కాల్ చేసిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు.