UP: ఆర్మీ హెలికాఫ్టర్‌ ఇంజిన్ ఫెయిల్‌.. చాకచక్యంగా నీటిలో దింపిన పైలట్

వరద బాధితులను ఆదుకునేందుకు వెళుతున్న ఆర్మీ హెలికాఫ్టర్ ఇంజిన్ ఫేయిల్ అవ్వడంతో నీటిలో ల్యాండ్ అయ్యింది.

Update: 2024-10-02 12:18 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: వరద బాధితులను ఆదుకునేందుకు వెళుతున్న ఆర్మీ హెలికాఫ్టర్ ఇంజిన్ ఫేయిల్ అవ్వడంతో నీటిలో ల్యాండ్ అయ్యింది. ఈ ఘటనలో పైలట్ సహా ఇతర సిబ్బందిని స్థానిక ప్రజలు రక్షించారు. బీహార్ లోని ముజఫర్‌పూర్ ప్రాంతంలో ఇటీవల భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఇక్కడ వరదలతో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. పెద్ద ఎత్తున ప్రజలు పునరావాసం కోల్పోయారు. దీంతో వరద బాధితుల సహాయార్ధం ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ఈ నేపధ్యంలోనే వరద బాదితులకు ఆహారం సహా ఇతర వస్తువులు సప్లై చేసేందుకు సీతామర్హికి వెళుతున్న ఓ ఆర్మీ హెలికాఫ్టర్.. మార్గమధ్యంలో ఇంజిన్ ఫెయిల్ అయ్యింది. దీంతో చాకచక్యంగా వ్యవహరించిన పైలట్ హెలికాఫ్టర్ ని ఔరాయ్ ప్రాంతంలోని ఓ నీటి కుంటలో దింపాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్టు అయ్యింది. ఈ ప్రమాదంలో పైలట్ సహా మరో నలుగురు ఐఏఎఫ్ సిబ్బంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదాన్ని గమణించిన స్థానికులు వారిని రక్షించారు. అనంతరం వీరిని చికిత్స నిమిత్తం అక్కడి నుంచి స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించినట్లు జిల్లా డీఎం సుబ్రతా సేన్ ఓ మీడియా చానెల్ తో చెప్పారు. 


Similar News