మహిళ పోలీసుతో అక్రమ సంబంధం.. డీఎస్పీ నుంచి ఏకంగా కానిస్టేబుల్‌గా డిమోట్

ఓ డీఎస్పీ మహిళ కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో అయనను కానిస్టేబుల్‌గా డిమోషన్ చేస్తూ పోలీసు శాఖ తగిన బుద్ది చెప్పింది. ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Update: 2024-06-23 09:06 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఓ డీఎస్పీ మహిళ కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో అయనను కానిస్టేబుల్‌గా డిమోషన్ చేస్తూ పోలీసు శాఖ తగిన బుద్ది చెప్పింది. ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే, ప్రజలకు మంచి చెడ్డలు చెప్పాల్సిన పోలీసులే కొంత మంది తమ శాఖకు చెడ్డపేరు తెస్తున్నారు. కొంత మంది పోలీసులు తమ తోటి మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడటం, ఇతర మహిళలపై లైంగిక బెదిరింపులకు దిగడం వంటివి ఈ మధ్య తరచుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ పోలీసు శాఖలో తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే.. క్రిపా శంకర్ కనౌజియా కానిస్టేబుల్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి డీఎస్పీ స్థాయికి చేరుకున్నారు. కానీ మూడేళ్ల క్రితం ఓ మహిళ కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఆ సమయంలో ఉన్నావ్‌లోని బిఘాపూర్‌ సర్కిర్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించేవారు. ఆ సమయంలో కుటుంబ కారణాలు చెప్పి లీవ్‌ పెట్టారు. ఇంటికి వెళ్లాడానికి బదులు ఓ మహిళా కానిస్టేబుల్‌తో కలిసి కాన్పూర్‌లోని ఓ లాడ్జ్‌కు వెళ్లాడు. ఆ సమయంలో తన వ్యక్తిగత, అధికారిక ఫోన్లను స్విచ్ఛాఫ్‌ చేశాడు. దీంతో భర్త ఇంటికి రాకపోవడం, ఫోన్లు సైతం కలువకపోవడంతో అతని భార్య భయపడిపోయింది. ఈ క్రమంలోనే జిల్లా ఎస్పీని ఆశ్రయించారు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చేపట్టారు. అయితే ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా కాన్పూర్‌లోని ఓ లాడ్జ్‌లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. మహిళా కానిస్టేబుల్‌తో ఏకాంతంగా గడుపుతుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే ఉన్నతాధికారి మహిళా కానిస్టేబుల్‌తో ఉండటాన్ని యూపీ పోలీ‌స్ అధి‌కారులు సిరియస్‌గా తీసుకున్నారు. వెంటనే ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. సీసీటీవీ ఫుటేజీ తో పాటు ఇతర ఆధారాలు సేకరించారు. ఈ క్రమంలోనే అతడిపై క్రమశిక్షణా రాహిత్యం కింద కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా డీఎస్పీగా ఉన్న అతడిని గోరఖ్‌పూర్‌లోని 26వ ప్రావిన్షియల్‌ ఆర్మ్‌డ్‌ కానిస్టేబులరీ (పీఏసీ) బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా డిమోషన్ చేస్తూ ఉత్తర ప్రదేశ్ పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

Tags:    

Similar News