Up assembly: యూపీ ప్రతిపక్ష నేతగా మాతా ప్రసాద్ పాండే.. ఎస్పీ కీలక నిర్ణయం
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మాతా ప్రసాద్ పాండేను సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) ఆదివారం నియమించింది. ఎస్పీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మాతా ప్రసాద్ పాండేను సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) ఆదివారం నియమించింది. ఎస్పీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పాండే రాష్ట్రంలోని సిద్ధార్థనగర్ జిల్లా ఇత్వా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన రెండు పర్యాయాలు అసెంబ్లీ స్పీకర్‌గానూ పనిచేశారు. యూసీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందే ఎస్పీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అలాగే సభలో పార్టీ చీఫ్ విప్‌గా మాజీ మంత్రి, కాంత్ ఎమ్మెల్యే కమల్ అక్తర్, డిప్యూటీగా రాణిగంజ్ ఎమ్మెల్యే రాకేష్ కుమార్ వర్మలను అఖిలేష్ యాదవ్ నియమించారు. కాగా, గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న అఖిలేష్ యాదవ్ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందడంతో ఆ స్థానం ఖాళీ అయింది. దీంతో మాతా ప్రసాద్ పాండేను ఎంపీక చేశారు. అయితే ఈ పదవికి ముగ్గురు నేతలు పోటీ పడ్డప్పటికీ ఎస్పీ శ్రేణులంతా ప్రసాద్ వైపే మొగ్గు చూపారు.