మరోవివాదంలో కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాథే..

కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాథే మరో వివాదంలో చిక్కుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌ లో కాంకేర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌ లో 29 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయిన తెలిసిందే.

Update: 2024-04-18 12:51 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాథే మరో వివాదంలో చిక్కుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌ లో కాంకేర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌ లో 29 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయిన తెలిసిందే. దీనిపై సుప్రియా శ్రీనాథే మాట్లాడిన వీడియో వైరల్ అయ్యింది. ఎన్‌కౌంటర్‌పై కాంగ్రెస్ అధికారిక ప్రతినిధి సుప్రియ స్పందిస్తూ.. చనిపోయిన మావోయిస్టులను షహీద్(అమరవీరులు) అని పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీనిపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్‌ నక్సలైట్లను అమరవీరులు అని పిలిచి ప్రజలు, పోలీసులు, ప్రజాస్వామ్యాన్ని ఆమె అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. భద్రతా బలగాల చర్యను స్వాగతించే బదులు, కాంగ్రెస్ వారి నుండి ఆశించిన పనే చేసిందని విమర్సలు గుప్పించారు బీజేపీ అధికార ప్రతినిది షెహజాద్ పూనావాలా. నక్సల్స్ ని అమరవీరులని కాంగ్రెస్ ప్రకటించడం దారుణమని మండిపడ్డారు. ఇది మన భద్రతా బలగాల ధైర్యసాహసాలను ప్రశ్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే.. ఇటీవల కూడా సుప్రియ కంగనా రనౌత్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిమాచ్‌ప్రదేశ్‌లోని మండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంగనాపై అభ్యంతరకర పోస్ట్ పెట్టింది.దీనిపై రాజకీయంగా దుమారం రేగింది. దీంతో లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సుప్రియాను పక్కనపెట్టింది. ఈసీ కూడా ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.


Similar News