బ్రేకింగ్ : సభలో ప్రసంగిస్తూ స్పృహతప్పి పడిపోయిన కేంద్ర మంత్రి గడ్కరీ
దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్రలోని యావత్మాల్‌లో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ స్పృహతప్పి పడిపోయారు.
దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్రలోని యావత్మాల్‌లో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ స్పృహతప్పి పడిపోయారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. యావత్మాల్ పరిధిలోని పూసాద్ పట్టణంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తుండగా.. గడ్కరీ ఒక్కసారిగా స్పృహ కోల్పోయారు. అనంతరం ఆయన కిందపడిపోబోయారు. దీంతో అక్కడే వేదికపై ఉన్న బీజేపీ నాయకులు పరుగుపరుగున వచ్చి గడ్కరీని పట్టుకున్నారు. స్పృహలోకి వచ్చేందుకు ఆయన మొహంపైకి పలువురు పార్టీ కార్యకర్తలు నీళ్లను చల్లారు. వెంటనే హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రిలో గడ్కరీని చేర్పించారు. బహుశా తీవ్రమైన ఎండలు, వడగాలుల ప్రభావం వల్లే గడ్కరీ స్పృహతప్పి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రత్యేకించి గడ్కరీ పర్యటించిన యావత్మాల్ ప్రాంతంలో ప్రస్తుతం తీవ్రమైన వడగాలులు వీస్తున్నాయి. ఏక్‌నాథ్ షిండే శివసేన పార్టీ అభ్యర్థి రాజశ్రీ పాటిల్ తరఫున ప్రచారం చేయడానికి యావత్మాల్ లోక్‌సభ స్థానంలో గడ్కరీ పర్యటిస్తున్నారు. మహారాష్ట్రలోని బుల్దానా, అకోలా, అమరావతి, వార్ధా, హింగోలి, నాందేడ్, పర్భానీలతో పాటు యావత్మాల్ లోక్‌సభ స్థానాలలో శుక్రవారం (ఏప్రిల్ 26న) పోలింగ్ జరగనుంది.