సొంత నియోజకవర్గంలో కేంద్రమంత్రికి చేదు అనుభవం (వీడియో)

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిశిత్ ప్రమాణిక్‌కు సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది.

Update: 2023-02-25 13:00 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిశిత్ ప్రమాణిక్‌కు సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. శనివారం కేంద్రమంత్రి ఆయన నియోజకవర్గమైన పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తుండగా కాన్వాయ్‌పై దాడి జరిగింది. కూచ్‌బెహర్‌లో దుండగులు కేంద్రమంత్రి కారుపై రాళ్లు విసిరారు. స్థానిక బీజేపీ ఆఫీసుకు ఆయన వెళ్తుండగా ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి హానీ జరగలేదు. అయితే ఆయన ప్రయాణిస్తున్న కారు ముందు అద్దం పగిలిపోయింది. అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారు వెనక్కి తగ్గకపోవడంతో టియర్ గ్యాస్ ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టారు.

ఈ ఘనటపై స్పందించిన కేంద్రమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిని త‌ృణముల్ కాంగ్రెస్ కార్యకర్తలే చేశారని నిశిత్ ప్రమాణిక్ ఆరోపించారు. ‘ఒక మంత్రికే రక్షణ లేదంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో ఊహించుకోండి. బెంగాల్‌లో ప్రజాస్వామ్యం పరిస్థితి ఏంటో ఈ ఘటన ద్వారా తెలిసిపోయింది. ఇక్కడ పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. హింసకు పాల్పడిన వారికి రక్షణ కల్పిస్తున్నారు’ అని ఆయన విమర్శించారు. కాగా, కూచ్ బెహర్ నుంచి ఎంపీగా ప్రమాణిక్ ఎన్నికయ్యారు. ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటుంది. ఇటీవల బీఎస్ఎఫ్ జరిపిన కాల్పుల్లో గిరిజనుడు చనిపోవడంపై కేంద్ర మంత్రి ప్రమాణిక్‌పై ప్రజలు కోపంతో ఉన్నారని స్థానిక రిపోర్టులు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో దాడి జరిగినట్లు తెలిపాయి.

Tags:    

Similar News