Union Budget-2024: వాహనదారులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బ్యాటరీ, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు

2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

Update: 2024-07-23 17:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ మేరకు ఆమె వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పారు. రానున్ రోజుల్లో బ్యాటరీ, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు గణనీయంగా తగ్గుతాయాని పేర్కొన్నారు. అయితే, ఎలక్ట్రిక్ వాహనాల్లోని బ్యాటరీలలో వాడే లిథియం, కోబాల్ట్ లాంటి అరుదైన 25 ఖనిజాల మీద టాక్స్ పూర్తిగా కేంద్రం మినహానింపునిచ్చింది. కాగా ఆ ఖనిజాలను అటామిక్, అంతరిక్షం, రక్షణ, టెలి కమ్యూనికేషన్స్, హైటెక్ వంటి రంగాల్లో వాడతారు. ఖనిజాలపై కస్టమ్స్ సుంకాలను తగ్గించడం వల్ల లిథియం-అయాన్ బ్యాటరీల ధరలు భారీగా తగ్గనున్నాయి. దీంతో బ్యాటరీ, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా కిందకు దిగి వస్తాయని అర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. 

Tags:    

Similar News