యూజీసీ నెట్ ఎగ్జామ్ వాయిదా
పొంగల్, మకర సంక్రాంతి పండుగల నేపథ్యంలో జనవరి 15న జరగాల్సిన పరీక్షను వాయిదా వేసినట్లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది.

- రేపటి పరీక్షకు మాత్రమే వర్తింపు
- 16 నాటి పరీక్ష యధాతథం
దిశ, నేషనల్ బ్యూరో:
యూజీసీ నెట్ 2024 (డిసెంబర్) పరీక్షను వాయిదా వేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తెలిపింది. పొంగల్, మకర సంక్రాంతి పండుగల నేపథ్యంలో జనవరి 15న జరగాల్సిన పరీక్షను వాయిదా వేసినట్లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ పరీక్ష కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. కాగా, జనవరి 16న జరగాల్సిన పరీక్ష యధాతథంగా ఉంటుందని ఎన్‌టీఏ పేర్కొంది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం, పీహెచ్‌డీలో ప్రవేశాల కొరకు 85 సబ్జెక్టుల్లో ఈ నెల 3 నుంచి 16 వరకు యూజీసీ నెట్ 2024 (డిసెంబర్) పరీక్షలను ఎన్‌టీఏ నిర్వహిస్తోంది. అయితే పండుగల నేపథ్యంలో అభ్యర్థుల నుంచి పలు వినతులు రావడంతో జనవరి 15న జరిగే పరీక్షను వాయిదా వేసినట్లు ఎన్‌టీఏ వెల్లడించింది.