సుప్రీంకోర్టుకు చేరిన మహారాష్ట్ర పంచాయతీ
శివసేన పార్టీ అధికారిక గుర్తును సీఎం ఏక్‌నాథ్ శిండే వర్గానికి కేటాయిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: శివసేన పార్టీ అధికారిక గుర్తును సీఎం ఏక్‌నాథ్ శిండే వర్గానికి కేటాయిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విల్లంబుల గుర్తుపై గెలిచిన ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు ప్రస్తుతం ఏక్‌నాథ్ శిండేకే ఉందని ఈసీ పేర్కొంది. ఈ మేరకు 78 పేజీల ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా గత ఉప ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి కేటాయించిన 'ఫ్లేమింగ్ టార్చ్' గుర్తును ఆ వర్గం కొనసాగించుకోవచ్చని తెలిపింది.
దీంతో ఎన్నికల సంఘం నిర్ణయంపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. 'విల్లు, బాణం' గుర్తును ఎక్ నాథ్ షిండేకు ఈసీ కేటాయించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రేపు(మంగళవారం) మళ్ళీ బెంచ్ ముందు ప్రస్తావించాలి అని సీజేఐ చంద్రచూడ్ సూచించారు.
Also Read..