UCC: యూనిఫాం సివిల్ కోడ్‌‌పై 46 లక్షల అభిప్రాయలు..

Update: 2023-07-11 16:18 GMT

న్యూఢిల్లీ: 'యూనిఫాం సివిల్ కోడ్‌' ‌పై అభిప్రాయలు పంపించేందుకు గడువు మరో రెండు రోజులే ఉంది. ఇప్పటి వరకు 46 లక్షలకు‌పైగా స్పందనలు అందాయని లా కమిషన్ మంగళవారం తెలిపింది. కొన్ని సంస్థలను, వ్యక్తులను వ్యక్తిగతంగా పిలవాలని 'లా కమిషన్' భావిస్తోంది. కొందరికి ఆహ్వాన లేఖలు కూడా పంపించింది. రాజకీయంగా సున్నితమైన ఈ అంశంపై ప్రజల, గుర్తింపు పొందిన మత సంస్థల అభిప్రాయాలను 'లా కమిషన్' గత నెల 14వ తేదీన ఆహ్వానించింది.

పార్లమెంటరీ కమిటీ ముందు హాజరైన 'లా ప్యానెల్' ప్రతినిధులు తాజా సంప్రదింపులను సమర్ధించారు. వారసత్వం, దత్తత తదితర వ్యక్తిగత అంశాలకు సంబంధించి మతం, వర్గంతో సంబంధం లేకుండా దేశంలోని పౌరులందరికీ ఒకే చట్టం అమలు చేయడమే 'యూనిఫాం సివిల్ కోడ్' లక్ష్యం. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో యూసీసీ ఒకటి. యూసీసీని త్వరలో అమలు చేస్తామని ఉత్తరాఖండ్ ప్రకటించింది.


Similar News