Jammu Kashmir : ‘ఉగ్ర’ ఘాతుకం.. ఇద్దరు విలేజ్ డిఫెన్స్ గార్డుల దారుణ హత్య

దిశ, నేషనల్ బ్యూరో : జమ్మూకశ్మీర్‌(Jammu Kashmir)లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు.

Update: 2024-11-07 18:39 GMT

దిశ, నేషనల్ బ్యూరో : జమ్మూకశ్మీర్‌(Jammu Kashmir)లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. గురువారం కిష్త్వార్ జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందిన ఇద్దరు విలేజ్ డిఫెన్స్ గార్డు (వీడీజీ)లను ఇళ్ల నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లి దారుణంగా హత్య చేశారు. వారిద్దరి డెడ్‌బాడీలను కుంత్వారా అటవీ ప్రాంతంలో పోలీసులు గుర్తించారు. హత్యకు గురైన ఇద్దరు వీడీజీలను (village defence guards) నజీర్ అహ్మద్, కుల్దీప్ కుమార్‌లుగా గుర్తించారు. దీంతో సంఘటనా స్థలం పరిసర ప్రాంతాల్లో ఉగ్రవాదుల ఆచూకీ కోసం భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్‌ను వేగవంతం చేశాయి.

విలేజ్ డిఫెన్స్ గార్డులది పర్మినెంటు ఉద్యోగం కాదు. తాత్కాలిక ప్రాతిపదికన కశ్మీరులోని నిరుద్యోగ యువతకు వీడీజీలుగా అవకాశం కల్పిస్తున్నారు. ఈ పోస్టులకు ఎంపికయ్యే వారికి నిఘా సమాచారాన్ని సేకరించడంపై, ఆయుధాలను వినియోగించడంపై ట్రైనింగ్ ఇస్తారు. సొంత జిల్లాల్లోనే వీడీజీలకు పోస్టింగ్ లభిస్తుంది. ఆయా ఏరియాల్లో భద్రతా బలగాల ఆపరేషన్లకు వీరు సహకారాన్ని, సమాచారాన్ని అందిస్తుంటారు. 1990వ దశకంలోనే వీడీజీల వ్యవస్థ కశ్మీరులో మొదలైంది. అప్పట్లో దీన్ని విలేజ్ డిఫెన్స్ కమిటీ (వీడీసీ) అని పిలిచేవారు. ఇప్పుడు పేరును విలేజ్ డిఫెన్స్ గార్డుగా మార్చారు.

Tags:    

Similar News