శవపేటికలా పార్లమెంట్ అంటూ ట్వీట్.. ఆర్జీడీపై బీజేపీ ఆగ్రహం
శవపేటికలా కొత్త పార్లమెంట్ బిల్డింగ్ అంటూ అర్థం వచ్చేలా ఆర్జేడీ చేసిన ట్వీట్ పై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: శవపేటికలా కొత్త పార్లమెంట్ బిల్డింగ్ అంటూ అర్థం వచ్చేలా ఆర్జేడీ చేసిన ట్వీట్ పై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతకన్నా దౌర్భగ్యం ఏముంటుందని ఫైర్ అయింది. ఆర్జేడీపై దేశ ద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేసింది. ఆర్జేడీకి కనీసం బుద్ధి లేదని సుశీల్ కుమార్ మోడీ అన్నారు. శాశ్వతంగా పార్లమెంట్ ను బహిష్కరించినట్లు ఆర్జేడీ భావిస్తోందా అన్నారు. ఆర్జేడీ ఎంపీలు పార్లమెంట్ కు రాకుండా ఉంటారా? అని ప్రశ్నించారు.
Read More: New Parliament building inauguration : పార్లమెంట్ భవనాన్ని శవపేటికతో పోల్చడంపై ఒవైసీ ఫైర్