టర్కీ భూకంపం: బతికేందుకు తన మూత్రాన్ని తానే తాగిన 17 ఏళ్ల బాలుడు
టర్కీలో ఇటీవల భూకంపం సంభవించి 24 వేల మంది మృతిచెందిన విషయం తెలిసిందే..
దిశ, వెబ్‌డెస్క్: టర్కీలో ఇటీవల భూకంపం సంభవించి 24 వేల మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఓ అపార్ట్‌మెంట్ కింద అద్నాన్ ముహమ్మత్ కోర్కుట్ అనే 17 ఏళ్ల బాలుడు చిక్కుకున్నాడు. దాదాపు 94 గంటల పాటు శిథిలాల కిందనే ఉండిపోయాడు. అతడిని కాపాడి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే అద్నాన్ కోలుకున్న తర్వాత చిక్కుకున్నప్పుడు ఉన్న పరిస్థితిని అందరితో తెలియజేశాడు. శిథిలాల కింద ఉన్నప్పుడు బతికేందుకు తన మూత్రాన్ని తానే తాగానని తెలిపాడు. అంతేకాకుండా నిద్రపోకుండా ఉండేందుకు ప్రతి 25 నిమిషాలకు ఒక ఫోన్ అలారం సెట్ చేసుకున్నానని.. రెండు రోజుల తర్వాత బ్యాటరీ డెడ్ అయిందని అద్నాన్ అన్నాడు.
"I drank my own urine to survive. I survived thanks to God"- 17-year-old Adnan tells rescuers after being stuck under rubble for 94 hours#TurkiyeQuakes pic.twitter.com/vUjdQemRKZ
— TRT World Now (@TRTWorldNow) February 10, 2023