బెంగాల్‌లో ఆ రెండు పార్టీలు బీజేపీతో కలిశాయి : Mamata Banerjee

పాట్నాలో విపక్షాల సమావేశం జరిగి వారమైనా గడవక ముందే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-06-26 13:23 GMT

పాట్నా : పాట్నాలో విపక్షాల సమావేశం జరిగి వారమైనా గడవక ముందే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు తనకు వ్యతిరేకంగా బీజేపీ తో చేతులు కలిపాయని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా మహా ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేయడానికి తాను ఓవైపు ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు సీపీఎం, కాంగ్రెస్‌లు బీజేపీ తరహాలో బెంగాల్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు.

రాష్ట్ర పంచాయతీ ఎన్నికల బహిరంగ సభలో దీదీ ఈ కామెంట్స్ చేశారు. బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్‌ల అపవిత్ర బంధాన్ని తాను విచ్ఛిన్నం చేస్తానని చెప్పారు. దీనిపై బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి స్పందిస్తూ.. బీజేపీపై దీదీ చేస్తున్న పోరాటంపై ఎన్నో సందేహాలు ఉన్నాయన్నారు. తృణమూల్‌తో తమకు లింకులు లేవని.. సీపీఎం, కాంగ్రెస్‌, తృణమూల్ ఒకే థాను ముక్కలని బీజేపీ నేత రాహుల్‌ సిన్హా స్పష్టం చేశారు.


Similar News