అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ముందంజ.. మరో కీలక పరిణామం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్ కన్నా.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు.

Update: 2024-05-13 16:03 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్ కన్నా.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు. న్యూయార్క్ టైమ్స్, సియానా కాలేజ్, ఫిలడెల్ఫియా ఎంక్వైరర్ పోల్ సర్వేలో ముందంజలో నిలిచారు. ఆరు కీలక రాష్ట్రాల్లో సర్వే నిర్వహించారు. ఐదింటిలో ట్రంప్ ముందంజలో ఉండగా.. జోబైడెన్ మాత్రం కేవలం ఒక స్టేట్ లోనే ఆధిక్యంలో ఉన్నట్లు తెలిసింది.

పెన్సిల్వేనియా, మిషిగన్‌, అరిజోనా, జార్జియా, నెవడా, విస్కాన్సిన్‌ రాష్ట్రాల్లో అత్యధిక సీట్లు సాధించిన వాళ్లకే అధ్యక్ష పీఠం దక్కే అవకాశం ఉంటుంది. ఈ ఆరు స్టేట్స్లో న్యూయార్క్ టైమ్స్, సియానా కాలేజ్ పోల్స్, ఫిలడెల్ఫియా సంస్థలు సర్వేలు చేపట్టాయి. దీంతో పెన్సిల్వేనియా, మిషిగన్, అరిజోనా, జార్జియా, నెవడాలో ట్రంప్ ముందంజలో నిలిచారు. జో బైడెన్ కేవలం విస్కాన్సిన్ స్టేట్లోనే స్వల్ప ఆధిక్యాన్ని ప్రదర్శించారు. మొత్తం ఆరు రాష్ట్రాల్లో 2020లో బైడెన్‌ వైపే ప్రజలు మొగ్గు చూపారు. కానీ, ఈ సారి మాత్రం పరిస్థితి విభిన్నంగా ఉంది.

మార్చిలో ఇచ్చిన స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగం తరువాత బైడెన్ కు మద్దతు పెరిగింది. అయితే, ఇమ్మిగ్రేషన్, కాస్ట్ ఆఫ్ లివింగ్, గాజాలో ఇజ్రాయెల్ ఆక్రమణ వంటి సమస్యల వల్ల ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపింది సర్వే.

ట్రంప్, బైడెన్ కు 18 నుంచి 29 సంవత్సరాల వయస్సు గల హిస్పానిక్ ఓటర్ల మద్దతు ఎక్కువగా ఉంది. ఈ ఓటర్లలో కూడా 2020లో బైడెన్‌కి 60శాతం పైగా ఓటు వేశారని పోల్ చూపించింది. 1964 పౌర హక్కుల చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుండి రిపబ్లికన్ ప్రెసిడెంట్ అభ్యర్థికి నల్లజాతి ఓటర్ల మద్దతు అధికంగా ఉంది. ట్రంప్ కు నల్లజాతి ఓటర్ల మద్దతు భారీగా ఉన్నట్లు సర్వేలో తేలింది.


Similar News