పశ్చిమ బెంగాల్ లోని మూడు టీవీ ఛానెల్స్ పై నిషేధం

కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ హత్యాచారం ఘటన తర్వాత బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగాల్ లోని మూడు టీవీ ఛానెల్స్ పై నిషేధం విధించింది.

Update: 2024-09-02 10:47 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ హత్యాచారం ఘటన తర్వాత బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగాల్ లోని మూడు టీవీ ఛానెల్స్ పై నిషేధం విధించింది. అభయ ఘటనపై రాష్ట్రంలో అలజడులు సృష్టించే ప్రయత్నం జరుగుతుందంటూ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసేలా పలు టీవీ ఛానెల్స్‌ అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. అధికార టీఎంసీకి చెందిన నేతలెవరూ ఆ మూడు ఛానెళ్లు నిర్వహించే చర్చా కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇంటర్వ్యూలు ఇవ్వడంలాంటివి చేయొద్దని ఆదేశాలు జారీ చేశారు. కేంద్రంలోని బీజేపీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. టీవీ ప్రమోటర్లు ఈడీ,సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకు ఢిల్లీ జమీందార్‌లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మేం వారి బాధను అర్థం చేసుకున్నామని ఎద్దేవా చేశామని ఎక్స్ వేదికగా దీదీ ఎద్దేవా చేస్తూ మాట్లాడారు.

టీవీ చర్చలో రచ్చ

ఓ టీవీ చర్చలో కొద్దిరోజుల క్రితం రచ్చ జరిగింది. ఆ చర్చలో అభయ కేసులో మమతా బెనర్జీ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారంటూ తృణమూల్ ఎంపీ కకోలి ఘోష్ దస్తిదార్.. బీజేపీ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్ మధ్య వాగ్వాదం జరిగింది. ఎంపీ దస్తిదార్.. ఎమ్మెల్యే ‌అగ్ని మిత్ర పాల్‌ను ‘శారీ మేకర్‌’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఎంపీ దస్తిదార్‌, ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన క్షమాపణలు చెప్పి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు. ఈ పరిణామాలతో మూడు టీవీ ఛానెల్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు మమతా బెనర్జీ ప్రకటన చేశారు.


Similar News