11 మందిని కన్న ఇక ఆపరేషన్ చేసుకుంటానన్న భార్య... వద్దంటూ ఆమెను ఇంటి నుంచి గెంటేసిన భర్త
రోజురోజుకు మనిషి టెక్నాలజీని అందిపిచ్చుకుని అధునాతన ప్రపంచంలో... tribal woman is mother of 11 children was driven out of the house
దిశ, వెబ్ డెస్క్: రోజురోజుకు మనిషి టెక్నాలజీని అందిపిచ్చుకుని అధునాతన ప్రపంచంలో ముందుకువెళ్తున్నాడు. ఇలా దినదినాభివృద్ధి చెందుతున్నాడు. కానీ, పలువురు మాత్రం మూఢనమ్మకాలు, ఆచారాలంటూ ముందుకు వెళ్తున్నారు. ఒడిశాలో 3 రోజుల క్రితం ఓ ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు ఆ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం... ఒడిశా రాష్ట్రంలోని కియోంజార్ జిల్లా డిమిరియా అనే విలేజ్ ఉంది. అయితే, ఆ విలేజ్ లో ఓ గిరిజన దంపతులు ఉన్నారు. వారికి పెళ్లి అయ్యి 11 సంవత్సరాలు అవుతోంది. అదేవిధంగా వారికి 11 మంది సంతానం. సంవత్సరానికి ఒకరు చొప్పున వారు మొత్తం 11 మందికి జన్మనిచ్చింది ఆ మహిళ. వారిలో ఒకరు మృతి చెందారు.
అయితే, ఇలా పిల్లలను కంటున్న క్రమంలో ఆ మహిళకు కొంతవరకు ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి. పూర్తిగా వీకైపోయింది. ఈ క్రమంలో ఆ మహిళ ఆ గ్రామానికి చెందిన ఆశా వర్కర్ ను సంప్రదించింది. పిల్లలు కాకుండా ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకోవాలని ఆశా వర్కర్ ఆ మహిళకు సూచించింది. అయితే, అందుకు ఆ మహిళ అంగీకరించి ఆ ఆపరేషన్ చేయించుకునేందుకు సిద్ధమైంది. ఈ విషయం ఆ మహిళ భర్తకు తెలిసింది. వెంటనే అతను తన భార్యను ఇంటి నుంచి గెంటివేశాడు. దీంతో ఆ మహిళ తన పిల్లలతో ఊరు బయట చెట్టు కింద ఉంటోంది. ఆశావర్కర్ అతడికి ఎంత సర్ధి చెప్పినా వినకపోగా, తనని బెదిరిస్తున్నాడని, తననే కాదు అతనికి ఎవరు సర్ధి చెప్పే ప్రయత్నం చేస్తున్నా వారిని తన టార్గెట్ గా చేసుకుంటున్నాడని పేర్కొన్నది. ఆపరేషన్ చేసుకోవడం తమ ఆచారానికి విరుద్ధమంటూ అడ్డుపడుతున్నాడని ఆమె తెలిపింది. టెల్కోయి ఆసుపత్రి వైద్యాధికారితో మాట్లాడించి అతడిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నది. అయితే, ఈ ఘటన స్థానికంగానే కాదు.. దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ విషయం తెలిసిన పలువురు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.