జంషెడ్పూర్ లో గల్లంతై.. రిజర్వాయర్లో తేలిన విమానం

ఇటీవల జార్ఖండ్ లో అదృశ్యమయిన శిక్షణ విమానం అక్కడికి దగ్గరలో ఉన్న ఓ రిజర్వాయర్లో పడి పోయినట్టు గుర్తించారు అధికారులు.

Update: 2024-08-25 17:26 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల జార్ఖండ్ లో అదృశ్యమయిన శిక్షణ విమానం అక్కడికి దగ్గరలో ఉన్న ఓ రిజర్వాయర్లో పడి పోయినట్టు గుర్తించారు అధికారులు. జంషెడ్పూర్ లోని సోనారీ విమానాశ్రయం నుండి ఈ నెల 20న ఇద్దరు పైలెట్లతో ఓ శిక్షణ విమానం గాల్లోకి ఎగిరింది. అయితే అది బయలు దేరిన కొద్దిసేపటికే అదృశ్యమయినట్టు అధికారులు గుర్తించారు. అప్పటి నుండి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నప్పటికీ విమానం జాడ లభించలేదు. రిజర్వాయర్లో చేపలు పడుతున్న జాలర్లు ఇచ్చిన సమాచారంతో విమానం ఆ డ్యాంలో కూలిపోయినట్టు నిర్ధారణకు వచ్చారు. ఇందుకోసం రెండు బృందాలతో రెస్క్యూ ఆపరేషన్ చేయించింది. ఇండియన్ నేవీ అధికారులు. విమానాన్ని డ్యాంలో ఉందని గుర్తించినప్పటికీ, ఇంకా బయటికి తీసుకు రాలేదు. సోమవారం సాయంత్రం వరకు విమానాన్ని బయటకు తీసుకు వస్తామని, అలాగే పైలెట్ల మృతదేహాలను వెలికి తీస్తామని అధికారులు వెల్లడించారు. 


Similar News