Bangladesh: పశ్చిమబెంగాల్ ప్రజలకు బంగ్లాదేశ్ గుడ్ న్యూస్

దేవీ నవరాత్రులకు ముందు పశ్చిమ బెంగాల్ వాసులకు బంగ్లాదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే 3 వేల టన్నుల హిల్సా చేపలను భారత్ ఎగుమతి చేసేందుకు అంగీకరించింది.

Update: 2024-09-22 08:27 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేవీ నవరాత్రులకు ముందు పశ్చిమ బెంగాల్ వాసులకు బంగ్లాదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే 3 వేల టన్నుల హిల్సా చేపలను భారత్ ఎగుమతి చేసేందుకు అంగీకరించింది. కాగా, బంగ్లాలో హింసాత్మక ఘర్షణ వల్ల మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయి, తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. దీంతో, ఈ ఏడాది భారతదేశానికి హిల్సా చేపల ఎగుమతిని నిషేధిస్తున్నట్లుగా ఈ నెల ప్రారంభంలో బంగ్లా ప్రభుత్వం పేర్కొంది.

హిల్సా ఎగుమతులపై నిషేధం

పశ్చిమ బెంగాల్‌లో ఘనంగా నిర్వహించే దేవీ నవరాత్రి ఉత్సవాల సమయంలో హిల్సాను వండుకుని తింటారు. బంగ్లాదేశ్‌లోని పద్మా నదిలో ఈ చేపలు పుడతాయి. అందుకే వీటికి పద్మా పులస అనే పేరొచ్చింది. ప్రపంచంలోని దాదాపు 70 శాతం హిల్సాలు బంగ్లాదేశ్‌లో ఉత్పత్తి అవుతాయి. 2012లో తీస్తా నది నీటి భాగస్వామ్య ఒప్పందంపై భారత్‌కు- బంగ్లా మధ్య విభేదాలు తలెత్తడంతో హిల్సా చేపల ఎగుమతిపై నిషేధం విధించింది. దీంతో, మార్కెట్ లో హిల్సా ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో, సరిహద్దులో హిల్సా చేపల స్మగ్లింగ్ మొదలయ్యింది. కాగా.. 2022లో అప్పటి బంగ్లా ప్రధాని షేక్ హసీనా నిషేధాన్ని ఎత్తేశారు.


Similar News