విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపు రాష్ట్రంలోని 5 జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు

ప్రకృతి ప్రకోపానికి కేరళ రాష్ట్రంలోని వయనాడ్ అతలాకుతలం అయ్యింది. భారీగా కురిసిన వర్షాలకు వరదలు జల ప్రళయం సృష్టించడంతో

Update: 2024-07-30 16:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రకృతి ప్రకోపానికి కేరళ రాష్ట్రంలోని వయనాడ్ అతలాకుతలం అయ్యింది. భారీగా కురిసిన వర్షాలకు వరదలు జల ప్రళయం సృష్టించడంతో పాటు మరికొన్ని చోట్ల కొండ చరియలు విరిగిపడటంతో వయనాడ్ స్మశానాన్ని తలపించింది. ఈ ప్రకృతి విపత్తుకు ఇప్పటి వరకు 100 మందికి పైగా మరణించగా.. మరో 100 మందికి పైగా గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొందరు శిథిలాల కిందే చిక్కుకోగా ఘటన స్థలంలో రెస్య్కూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగానే కేరళలోని 8 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

ఈ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసిన ఐఎండీ.. అప్రమత్తంగా ఉండాలని కేరళ ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది. దీంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న ఐదు జిల్లాలోని విద్యా సంస్థలకు కేరళ గవర్నమెంట్ రేపు (బుధవారం) సెలవు ప్రకటించింది. కాసర్‌గోడ్, త్రిస్సూర్, మలప్పురం, కన్నూర్, పత్తనంతిట్ట జిల్లాలో విద్యా సంస్థలకు హాలీడే ఇస్తూ విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం సూచించింది. 


Similar News