Toll-Free Entry: ముంబయికి వెళ్లే వాహనాలకు గుడ్ న్యూస్

ముంబయికి వెళ్లే లైట్ మోటార్ వాహనాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది.

Update: 2024-10-14 07:28 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ముంబయికి వెళ్లే లైట్ మోటార్ వాహనాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఇకపై ముంబయి నగరంలోకి ప్రవేశించే మొత్తం ఐదు టోల్ బూత్ ల వద్ద లైట్ మోటార్ వాహనాలకు టోల్ చార్జీలు వసూలు చేయకూడదని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ లో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇవాళ అర్ధరాత్రి నుంచే ఈ నిర్ణయం అమల్లోకి రానున్నది. ఈ నిర్ణయంతో దహిసల్, ములుంద్, వాషి, ఐరోలి, తిన్హంత్ నాకాల్లో ని టోల్ ప్లాజాల వద్ద కార్లు, ఎస్ యూవీలు ఎలాంటి రుసులు చెల్లించకుండానే నగరంలోకి ప్రవేశించే అవకాశం ఉండనుంది. ప్రస్తుతం ఇక్కడ రూ. 45 టోల్ ఫీజు వసూలు చేస్తుండగా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో చిన్న వాహనదారులకు ఊరట కలగనున్నది. అయితే త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. గతంలో చాలా సార్లు టోల్ వసూళ్లకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. ఆ సమయంలో ఎలాంటి రాయితీలు ఇవ్వని ప్రభుత్వం ఎన్నికలకు నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలకు ముంగిట్లో ఈ ప్రయోజనం కల్పించడం వెనుక ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదంతా ఎన్నికల స్టంట్ అని మండిపడుతున్నాయి. 


Similar News