భారత్‌లో ఏం మారిందో చెప్పేసిన విదేశాంగ మంత్రి జైశంకర్

దిశ, నేషనల్ బ్యూరో : ‘‘భారతదేశంలో ఏం మారింది అని ఎవరైనా అడిగితే .. నేను భారతదేశ విజన్ మారిందని చెబుతున్నాను’’ అని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఛెప్పారు.

Update: 2024-01-06 18:33 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ‘‘భారతదేశంలో ఏం మారింది అని ఎవరైనా అడిగితే .. నేను భారతదేశ విజన్ మారిందని చెబుతున్నాను’’ అని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చెప్పారు. గత పదేళ్లలో భారతదేశం ఎంతో మారిందని, ప్రస్తుతం ప్రపంచమంతా భారత్‌ గురించి చర్చిస్తోందని తెలిపారు. శనివారం తిరువనంతపురంలో జరిగిన ‘వికసిత్ సంకల్ప్ భారత్ యాత్ర’లో ఆయన ఈ కామెంట్స్ చేశారు. గత దశాబ్ద కాలంలో ప్రధాని మోడీ హయాంలో భారత దేశ విజన్ మారిందన్నారు. 10,20,30 ఏళ్ల క్రితం ఇదే భారతదేశంలో ఎలాంటి మార్పు కూడా కనిపించలేదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలోని ప్రజలకు ఆధార్, బ్యాంకు ఖాతాలు ఉన్నాయని.. అన్ని రంగాల్లో సాంకేతికత వినియోగం గణనీయంగా పెరిగిందని జైశంకర్ వివరించారు. ఆరోగ్యం, నీరు, విద్యుత్, ఇల్లు, విద్య వంటి భారతీయులు ఎదుర్కొనే అనేక సమస్యలు అభివృద్ధి చెందిన దేశాలలో కూడా ఉన్నాయన్నారు. 46 ఏళ్ల పాటు విదేశాంగ శాఖలో పనిచేసిన తనకు.. గత 10 సంవత్సరాలే ఎక్కువ సంతృప్తినిచ్చాయని ఆయన తెలిపారు. ఎందుకంటే ప్రభుత్వం పనితీరులో తాను పెద్ద మార్పును చూశానన్నారు.

Tags:    

Similar News