నేడు జాతీయ సెల్ఫీ దినోత్సవం
ఈ సెల్ఫీ ట్రెండ్ ఎప్పుడైతే మనకీ అందుబాటులోకి వచ్చిందో .. అప్పటి నుంచి జనాలు పూర్తిగా మారిపోయారు.
దిశ, ఫీచర్స్: మనలో చాలా మంది కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు, అక్కడ సెల్ఫీలను తీసుకుని వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్స్టా లో పోస్ట్ చేస్తుంటారు. ఈ సెల్ఫీల వల్ల సంతోషపడిన వాళ్లు ఉన్నారు.. అలాగే ప్రాణాలను పోగొట్టుకున్న వాళ్లు ఉన్నారు. ప్రస్తుతం ఇదొక అలవాటుగా మారిపోయింది. ఈ సెల్ఫీ ట్రెండ్ ఎప్పుడైతే మనకీ అందుబాటులోకి వచ్చిందో .. అప్పటి నుంచి జనాలు పూర్తిగా మారిపోయారు. దానికి బానిసలుగా మారిపోయారనే చెప్పుకోవాలి. సమయం, సందర్భం లేకుండా .. ఎక్కడబడితే అక్కడ, ఎవరిష్టమొచ్చినట్లు వాళ్లు సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తుంటారు. ఒక రకంగా సెల్ఫీ మనిషి యొక్క బాధను కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజుకొక సెల్ఫీ తీసుకుంటే.. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయని చెబుతున్నారు. ప్రతి ఏడాది జూన్ 21న జాతీయ సెల్ఫీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.