నేడు జాతీయ బాలికా దినోత్సవం..

ప్రతి ఏడాది.. దేశంలో జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుతున్నారు.

Update: 2024-01-24 07:34 GMT

దిశ,ఫీచర్స్: ప్రతి ఏడాది.. దేశంలో జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుతున్నారు. మన సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి.. బాలురు, బాలికల మధ్య అసమానతలను తొలగించడానికి ప్రజలలో అవగాహన పెంచేందుకు ఈ ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుతున్నారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ.. ఈ రోజును ఘనంగా నిర్వహిస్తుంది. బాలికల హక్కులు, విద్య, ఆరోగ్యం, పోషకాహారం గురించి అవగాహన పెంచడం ద్వారా దేశంలోని బాలికలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యం.

జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా.. దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అవగాహనా సదస్సులు కూడా జరుగుతున్నాయి. బాలికలకు తగిన రక్షణ, ఆరోగ్యకర వాతావరణం కలిగించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో చర్చలు చేస్తున్నారు. జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు మూడు ప్రధాన లక్ష్యాలను కలిగి ఉంటాయి. మొదటిది, ఈ దేశంలో అమ్మాయిలు ఎదుర్కొంటున్న అసమానతలను ఇది హైలైట్ చేస్తుంది. రెండవది: బాలికల హక్కులపై అవగాహన పెంచుకోండి. చివరగా, బాలికలకు విద్య, ఆరోగ్యం మరియు పోషకాహారం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన పెంచడం లక్ష్యం.

Tags:    

Similar News