అంబేద్కర్ ఫొటో కాదు.. TN కోర్టులలో కేవలం గాంధీ, తిరువళ్ళువర్ ఫొటోలు మాత్రమే ఉండాలి
మద్రాసు హైకోర్టు మరో సంచల తీర్పును ప్రకటించింది. తమిళనాడులోని అన్ని కోర్టులు, వాటి ప్రాంగణాల్లో మహాత్మాగాంధీ, సెయింట్ తిరువళ్లువర్ విగ్రహాలు, చిత్రాలను మాత్రమే ప్రదర్శించాలని తీర్పునిచ్చింది.
దిశ, వెబ్‌డెస్క్: మద్రాసు హైకోర్టు మరో సంచల తీర్పును ప్రకటించింది. తమిళనాడులోని అన్ని కోర్టులు, వాటి ప్రాంగణాల్లో మహాత్మాగాంధీ, సెయింట్ తిరువళ్లువర్ విగ్రహాలు, చిత్రాలను మాత్రమే ప్రదర్శించాలని తీర్పునిచ్చింది. దీంతో పలు న్యాయ సంఘాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. కాగా కోర్టుల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలను పెట్టాలన్న వివిధ న్యాయవాద సంఘాల అభ్యర్థనలను హైకోర్టు తిరస్కరించింది. అలాగే TN కోర్టులలో కేవలం గాంధీ, తిరువళ్ళువర్ ఫొటోలు మాత్రమే ఉండాలని సర్క్యులర్ జారీ చేసింది.