BJP : పోలీసు యూనిఫాంపై బెంగాల్ బీజేపీ చీఫ్ వ్యాఖ్యలు.. ఈసీకి టీఎంసీ ఫిర్యాదు

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర సహాయ మంత్రి, బెంగాల్(West Bengal) బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్‌(Sukanta Majumdar)పై ఎన్నికల సంఘానికి తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ ఫిర్యాదు చేసింది.

Update: 2024-11-10 14:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర సహాయ మంత్రి, బెంగాల్(West Bengal) బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్‌(Sukanta Majumdar)పై ఎన్నికల సంఘానికి తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ ఫిర్యాదు చేసింది. ఐదుగురు ఎంపీలతో కూడిన టీఎంసీ టీమ్ ఈసీ(EC) కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదును అందజేసింది. అయితే కేంద్ర ఎన్నికల కమిషనర్లను వారు కలవలేకపోయారు. ‘‘బెంగాల్(BJP) పోలీసుల యూనిఫామ్‌పై ఉన్న జాతీయ చిహ్నం ప్లేసులో చెప్పులను డిస్‌ప్లే చేయాలి’’ అని నవంబరు 7న మజుందార్ కామెంట్ చేశారని ఫిర్యాదులో టీఎంసీ పేర్కొంది.

రాష్ట్ర బీజేపీ చీఫ్ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా, అవమానకరంగా, అసభ్యకరంగా ఉన్నాయని తెలిపింది. బెంగాల్ పోలీసుల ప్రతిష్ఠను దెబ్బతీసేలా సుకాంత మజుందార్‌ కామెంట్ చేశారని తృణమూల్ కాంగ్రెస్ విమర్శించింది. ‘‘రాజకీయ ఎజెండాను మనసులో పెట్టుకొని దురుద్దేశంతో వ్యాఖ్యలు చేసినందుకు వెంటనే క్షమాపణలు చెప్పేలా మజుందార్‌ను ఆదేశించండి’’ అని ఈసీని టీఎంసీ కోరింది.

Tags:    

Similar News