పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల్లో సత్తా చాటిన టీఎంసీ.. అన్ని స్థానాల్లో విజయం
పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన టీఎంసీ పార్టీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూడా మరోసారి హవాను కొనసాగించింది.
దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన టీఎంసీ పార్టీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూడా మరోసారి హవాను కొనసాగించింది. జూలై 10న రాష్ట్రంలోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా.. ఈ రోజు ఓట్ల లెక్కింపు పలితాల్లో పోటీ చేసిన నాలుగింటిలో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్ స్థానలు అయిన రాయ్‌గంజ్, బాగ్దా రణఘాట్ దక్షిణ్ అసెంబ్లీ స్థానాలను కూడా టీఎంసీ కైవసం చేసుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని మానిక్టాలా సెగ్మెంట్‌లో తిరుగులేని ఆధిక్యం సాధించింది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుచుకున్న టీఎంసీ తన విజయ పరంపరను కొనసాగించింది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) అభ్యర్థులు కృష్ణ కళ్యాణి, మధుపర్ణ ఠాకూర్, ముకుత్ మణి అధికారి వరుసగా రాయ్‌గంజ్, బాగ్దా, రణఘాట్ దక్షిణ్ స్థానాలను గెలుచుకోగా, కోల్‌కతాలోని మానిక్తలా సెగ్మెంట్‌లో సుప్తి పాండే ముందంజలో ఉన్నారు.