TMC : సాక్ష్యాల విధ్వంసంలో మమత సర్కారు హస్తం : షెహజాద్ పూనావాలా
దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనకు సంబంధించిన కేసులో సాక్ష్యాల ధ్వంసానికి మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ నేత షెహజాద్ పూనావాలా ఆరోపించారు.
దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనకు సంబంధించిన కేసులో సాక్ష్యాల ధ్వంసానికి మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ నేత షెహజాద్ పూనావాలా ఆరోపించారు. ‘‘ఈ కేసులో నిందితులను అరెస్టు చేయించాల్సింది పోయి.. హత్యాచార ఘటన జరిగిన ఆర్జీ కర్ మెడికల్ కాలేజీపైనే దాడి చేయించారు. దీని వెనుక కూడా టీఎంసీ ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు.
ఆదివారం ప్రముఖ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. పూనావాలా ఈ వ్యాఖ్యలు చేశారు. జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన చోటుచేసుకున్న సెమినార్ హాల్‌లోని ఆధారాలను తుడిచి పెట్టేందుకే కాలేజీపై అల్లరిమూకలతో దాడి చేయించారన్నారు. రాజ్యాంగం గురించి నీతులు చెప్పే రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్లు ఈ ఘటనపై మౌనంగా ఉండిపోయారని విమర్శించారు.