Thungabhadra Dam: తుంగభద్ర ప్రాజెక్ట్‌కు మొదటి స్టాప్‌లాక్ గేట్ బిగింపు విజయవంతం

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో కర్ణాటక రాష్ట్రం హోస్పేట్‌లోని తుంగభద్ర డ్యామ్ 19వ గేట్ చైన్ లింక్ తెగి గేటు భాగం వరద నీటిలో కొట్టుకుపోయింది.

Update: 2024-08-17 03:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో కర్ణాటక రాష్ట్రం హోస్పేట్‌లోని తుంగభద్ర డ్యామ్ 19వ గేట్ చైన్ లింక్ తెగి గేటు వరద నీటిలో కొట్టుకుపోయింది. దీంతో ప్రాజెక్ట్‌పై భారం పడకుండా మొత్తం 29 గేట్లను ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు సంబంధించిన అధికారులు సంయుక్తంగా నీటి వృథాను అరికట్టేందుకు యుద్ధ ప్రతిపదికన పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా 19వ గేట్ వద్ద స్టాప్‌లాక్ గేటుకు సంబంధించి మొదటి యూనిట్‌ను నిపుణులు విజయవంతంగా అమర్చారు.

ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వారిని అభినందించారు. ఇవాళ మరో ఐదు ఎలిమెంట్స్ అమర్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మొదటి యూనిట్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తవడంతో అక్కడున్న ఇరిగేషన్, టెక్నీషియన్లు ఆనందంతో సంబురాలు చేసుకున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 44,721 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 61,424 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం 1623.32 అడుగులు కాగా.. పూర్తి స్థాయి నీటి మట్టం 1,633 అడుగులుగా ఉంది. అదేవిధంగా ఈనెల 20 వరకు తుంగభద్ర డ్యామ్‌పై రాకపోకలను పూర్తిగా నిషేధిస్తున్నట్లుగా ఇరిగేషన్ అధికారులు ప్రకటించారు.

Tags:    

Similar News