Union Minister: ప్రజల క్షేమాన్ని గాలికి వదిలేసిన పార్టీలు.. నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాయి: కేంద్ర మంత్రి పీయూష్
బుధవారం పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్ డెస్క్: బుధవారం పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పార్లమెంట్ ఆవరణలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీ పై ప్రతిపక్షాలు వ్యక్తిగత ద్వేషం పెంచుకున్నాయి. ఈ కారణంగా వారు.. వారు తమ ప్రజల గురించి ఆలోచించడం లేదు.తెలంగాణ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు లతో పాటు ఎనిమిది రాష్ట్రాలు నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాయని అభిప్రాయ పడ్డారు. గత ఏడాది కూడా ఇలానే విక్షిత్ భారత్ కేంద్రంగా జరిగిన నీతి ఆయోగ్ సమావేశాలను పలు రాష్ట్రాల ప్రభుత్వాలు బహిష్కరించాయని గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరుగుతున్న ఇండియా కూటమిలోని పార్టీలు ప్రజాస్వామ్య వ్యవస్థను కూల్చివేసేందుకు ప్రయత్నిస్తున్నాయని పీయూష్ గోయల్ ఫైర్ అయ్యారు. ఇదిలా ఉంటే బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపు లేని కారణంగా తెలంగాణ ప్రభుత్వం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తూ ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రకటన చేసిన విషయం తెలిసిందే.