Haryana: వినేశ్, భజరంగ్ పోటీ చేసే స్థానాలు ఇవే..!

ఎట్టకేలకు భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, భజరంగ్ పూనియా శుక్రవారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

Update: 2024-09-06 14:20 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఎట్టకేలకు భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, భజరంగ్ పూనియా శుక్రవారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వీరిద్దరు కూడా హర్యానా అసెంబ్లీ ఎన్నికల బరీలో నిలబడనున్నట్లు తెలుస్తుంది. దీనిపై కచ్చితమైన సమాచారం లేనప్పటికి వారు పోటీ చేసే స్థానాలపై కూడా కొన్ని మీడియాలో కథనాలు వస్తున్నాయి. నివేదికల ప్రకారం, వినేశ్ ఫొగాట్ జులనా నుండి పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే, భజరంగ్ పూనియా బద్లీ నియోజకవర్గం నుంచి పోటీలో ఉండే అవకాశం ఉందని సమాచారం. అయితే కాంగ్రెస్ నుంచి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.

అక్టోబర్ 5 న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వీరు పోటీ చేస్తారని పుకార్లు వస్తున్నాయి. మరికొన్ని కథనాల ప్రకారం, పునియా రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని పార్టీ వర్గాలు పేర్కొన్నట్లు తెలుస్తోంది. వినేష్ ఫోగట్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారని, ఆమె సీటు త్వరలో ఖరారు కానుందని వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా వీరిద్దరి భవిష్యత్ ప్రణాళికపై రెండు రోజుల్లో స్పష్టత రానుంది. ఇదిలా ఉంటే, హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 5న పోలింగ్, అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.


Similar News