హరియాణలో మళ్లీ అలజడి.. 8 మంది మహిళలకు గాయాలు
హరియాణాలోని నూహ్‌లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గురువారం రాత్రి పూజకు వెళుతున్న మహిళలపై మసీదు నుంచి కొందరు ఆకతాయిలు రాళ్లు రువ్వడంతో ఎనిమిది
దిశ, డైనమిక్ బ్యూరో: హరియాణాలోని నూహ్‌లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గురువారం రాత్రి పూజకు వెళుతున్న మహిళలపై మసీదు నుంచి కొందరు ఆకతాయిలు రాళ్లు రువ్వడంతో ఎనిమిది మంది మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. మహిళలపై కొందరు బాలురు రాళ్లు విసిరిన వీడియో ఫుటేజ్ లభ్యమైందని నూహ్ ఎస్పీ ఇవాళ మీడియాకు తెలిపారు. మసీదులో నిర్మాణ పనులు జరుగుతున్న క్రమంలో గురువారం రాత్రి 8:20 గంటల ప్రాంతంలో పూజలు చేసేందుకు వెళుతున్న మహిళలపై మసీదులో నుంచి రాళ్లు రువ్వారని వీడియో ఫుటేజ్‌లో కనిపించిన బాలురిని ప్రశ్నిస్తున్నామని ఎస్పీ వెల్లడించారు. ఈ ఘటన కారణంగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొనడంతో ఇరు వర్గాలను శాంతింపచేశామని, ప్రస్తుతం పరిస్ధితి ప్రశాంతంగా ఉందని ఎస్పీ వెల్లడించారు. కాగా జులై 31న నూహ్‌లో వీహెచ్‌పీ బ్రజ్ మండల్ యాత్రపై అల్లరి మూకలు దాడి చేసిన అనంతరం జరిగిన మత ఘర్షణల్లో ఆరుగురు మరణించిన సంగతి తెలిసిందే.