దేశంలో టాప్ 10 యూనివర్సిటీలు ఇవే

దేశంలోని టాప్ 10 యూనివర్సిటీల జాబితాను కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది.

Update: 2023-06-05 10:45 GMT

దిశ, వెబ్ డెస్క్: దేశంలో టాప్ 10 యూనివర్సిటీల జాబితాను కేంద్ర విద్యాశాఖ రిలీజ్ చేసింది. నాణ్యత, సదుపాయాలు, పరిశోధన తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని దేశంలో బెస్ట్ యూనివర్సిటీల ర్యాంకులను ఎన్ఐఆర్ఎఫ్ ప్రకటించింది. కాగా టాప్ 10 యూనివర్సిటీల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పదో స్థానాన్ని దక్కించుకుంది.

ఇక ఆ టాప్ 10 యూనివర్సిటీలు ఇవే..

1. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు

2. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ, న్యూఢిల్లీ

3. జామియా మిలియా యూనివర్సిటీ, న్యూఢిల్లీ

4. జాదవ్ పూర్ యూనివర్సిటీ, కోల్కతా

5. బనారస్ హిందూ యూనివర్సిటీ, వారణాసి

6. మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, మణిపాల్

7. అమృత విశ్వ విద్యాపీఠం, కోయంబత్తూర్

8. వెల్లూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వెల్లూర్

9. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ, అలీఘర్

10. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్.

Tags:    

Similar News