స్టూడెంట్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన టీచర్.. చూస్తే కన్నీళ్లు ఆగవు! (వీడియో)
ప్రతి ఒక్కరి లైఫ్‌లో మోస్ట్ మెమరబుల్ డేస్ ఏవైనా ఉన్నాయా? అని అడిగితే ఎవరైనా టక్కున స్కూల్ డేస్ అని చెబుతుంటారు. స్కూల్ డేస్ మళ్లీ తిరిగొస్తే బావుండు అని బాధపడుతుంటారు.
దిశ, వెబ్‌డెస్క్: ప్రతి ఒక్కరి లైఫ్‌లో మోస్ట్ మెమరబుల్ డేస్ ఏవైనా ఉన్నాయా? అని అడిగితే ఎవరైనా టక్కున స్కూల్ డేస్ అని చెబుతుంటారు. స్కూల్ డేస్ మళ్లీ తిరిగొస్తే బావుండు అని బాధపడుతుంటారు. బాల్యంలో చదువుతో పాటు ఆటలకు సముచిత స్థానం ఉంటుంది కాబట్టి అందరూ ఇష్టపడుతుంటారు. స్కూల్ లైఫ్‌లో ఎన్నో సరదాలు, బ్యూటీఫుల్ మూవ్‌మెంట్స్, గిఫ్టులు, సర్‌ప్రైజ్‌లు ఉంటాయి. తాజాగా.. ఇలాంటి ఘటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎనిమిదేళ్ల బాలుడి కోసం క్లాస్‌మేట్స్, టీచర్ చేసిన పని కన్నీళ్లు తెప్పిస్తోంది. ఈ ఘటన కొలంబియాలో చోటు చేసుకుంది. కొలంబియాలోని ఎబెజికోలో పాఠశాల విద్యార్థి ఎనిమిదేళ్ల ఏంజెల్ డేవిడ్ పుట్టినరోజు వేడుకలను వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది. క్లాస్ టీచర్ సహా తోటి విద్యార్థులంతా కలిసి ఏంజెల్ కోసం ఊహించని పుట్టినరోజు వేడుకను నిర్వహించారు. అది చూసిన ఏంజెల్ పట్టరాని సంతోషంతో ఒక్కసారిగా ఏడ్చేశాడు.
వివరాల్లోకి వెళితే.. ఏంజెల్ తన పుట్టినరోజును జరుపుకునే అవకాశం ఎప్పుడూ రాలేదు. అతని కుటుంబం ఆర్థికంగా నిరుపేద కుటుంబం..ఎప్పుడూ పుట్టినరోజు వేడుకలను నిర్వహించలేకపోయింది. ఈ పరిస్థితిని గ్రహించిన అతని ఫ్రెండ్స్ అండ్ టీచర్ పుట్టినరోజును పెద్ద వేడుకగా చేశారు. క్లాస్ రూమ్‌లోనే బాలుడికి తెలియకుండా పుట్టిన రోజు వేడుకలను ఏర్పాటు చేశారు. అతడు క్లాస్‌లోకి అడుగుపెట్టిన వెంటనే తన క్లాస్‌మేట్స్ అంతా కలిసి పాటలు పాడుతూ పలకరించారు. ఇదంతా చూసిన ఆ ఎనిమిదేళ్ల చిన్నారి ముఖంలో ఆనందం కలిగించిందని వీడియో చూసిన వారు చెబుతున్నారు. ఆ తర్వాత పిల్లలంతా ఒక్కచోట చేరి అతన్ని కౌగిలించుకుని బర్త్‌డే విషేస్ చెబుతున్నారు.