కర్ణాటకలో బాంబు పేలిన రామేశ్వరం కేఫ్ నెల ఆదాయం.. అన్ని కోట్లా..?

ప్రశాంతంగా ఉన్న భారత దేశంలో ఒక్కసారిగా బాంబు పేలుడు సంచలనంగా మారింది. శుక్రవారం కర్ణాటకలో ప్రసిద్ధి చెందిన రామేశ్వరం కేఫ్‌లో ఘటన జరగ్గా.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Update: 2024-03-02 10:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రశాంతంగా ఉన్న భారత దేశంలో ఒక్కసారిగా బాంబు పేలుడు సంచలనంగా మారింది. శుక్రవారం కర్ణాటకలో ప్రసిద్ధి చెందిన రామేశ్వరం కేఫ్‌లో ఘటన జరగ్గా.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు రాగా.. రవ్వ ఇడ్లీ తీసుకున్న ఓ కస్టమర్ తనతోపాటు తీసుకొచ్చిన కుక్కర్ బాంబ్ ఉన్న సంచిని అక్కడే వదిలిపెట్టి వెళ్లిపోవడం కనిపింది.

ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా ఒక్కసారిగా అలజడి సృష్టించిన ఈ బాంబు పేలుడుతో.. అసలు అక్కడే ఎందుకు బాంబును వదిలిపెట్టారనే ప్రశ్న తలెత్తుతుంది. అయితే ఈ రామేశ్వరం కేఫ్ ఆ ప్రాంతంలోనే అత్యంత ఫేమస్ అయినది.. దీనికి రోజుకు వేల మంది కస్టమర్లు వచ్చి వెళుతుంటా.. ఈ కేఫ్ అన్ని ఖర్చులు పోను నెలకు 4.5 కోట్ల ఆదాయం వస్తుందని కేఫ్ ఓనర్ చెబుతున్నారు. కాగా ఈ రామేశ్వరం కేఫ్ లో అత్యధికంగా ఇడ్లీ, నెయ్యి ఇడ్లీ, బటర్ ఇడ్లీ, లెమన్ ఇడ్లీ, సాంబార్ ఇడ్లీని అత్యధికంగా ఇష్టపడి తింటుంటారు. అయితే ఈ బాంబు పేలుడులో ఉగ్ర కుట్ర ఉందా అనే కోణంలో ప్రభుత్వం, పోలీసులు విచారణ చేస్తుండగా.. హోటల్ బిజినెస్‌లో రామేశ్వరం కేఫ్ ఉన్న గుడ్‌విల్ ను దెబ్బతియడానికే ఇలా చేసి ఉంటారని కర్ణాటక లోకల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి.


Similar News