బ్రేకింగ్: చంద్రయాన్-3 ప్రాజెక్ట్‌ మొత్తంలోనే కీలక ఘట్టం స్టార్ట్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రుడి దక్షిణ ధృవంపై అన్వేషణ కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్- 3

Update: 2023-08-23 12:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రుడి దక్షిణ ధృవంపై అన్వేషణ కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్- 3 ప్రాజెక్ట్ కీలక ఘట్టానికి చేరుకుంది. చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్‌లోని విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై ల్యాండింగ్ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలం దిశగా ప్రయాణిస్తోంది. శాస్త్రవేత్తలు ల్యాండర్ వేగాన్ని క్రమంగా తగ్గించి.. చంద్రుడిపై ల్యాండర్ సేఫ్ ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే 6.4 నిమిషాలకు ల్యాండర్ చంద్రుడిపై కాలుమోపనుంది. జాబిల్లిపై చంద్రయాన్ 3 ల్యాండింగ్ ప్రక్రియ షూరు కావడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Read More..

చంద్రయాన్- 3 ప్రత్యక్ష ప్రసారం: చంద్రుడిపై కాలు పెట్టబోతున్న విక్రమ్ ల్యాండర్.. అద్భుతాన్ని మీరు చూసేయండి!  

Tags:    

Similar News