'ది కాశ్మీర్ ఫైల్స్' ఎఫెక్ట్: కాశ్మీర్ ముస్లీమ్‌ల‌కు ఢిల్లీ హోట‌ళ్లు షాక్‌!

కొంద‌రు థియేట‌ర్ల‌లోనే 'ధ‌ర్మ‌సంస్థాప‌న' ప్ర‌సంగాలు చేస్తున్నారు. 'The Kashmir Files' Effect: Kashmir Muslims denied...

Update: 2022-03-24 07:27 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః భార‌త‌దేశంలో ప్ర‌జ‌ల నుండి సినిమాని విడిదీసి చూడ‌లేము. వాళ్లు వ్యాపారం చేసుకుంటున్నార‌ని తెలిసినా ప్రేక్ష‌కులు మాత్రం సినిమావాళ్ల‌ను దేవుళ్లుగా భావిస్తారు. వాళ్లు చెప్పిందే అఖండ స‌త్య‌మ‌న్న‌ట్లు పాటిస్తారు. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల విడుద‌లైన వివాద‌స్ప‌ద సినిమా 'ది కాశ్మీర్ ఫైల్స్' ఇండియాలో తీవ్ర ప్ర‌భావం చూపిస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమాను చూసిన హిందువులు కొంద‌రు థియేట‌ర్ల‌లోనే 'ధ‌ర్మ‌సంస్థాప‌న' ప్ర‌సంగాలు చేస్తూ, వాటిని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ నేప‌ధ్యంలో తాజాగా భార‌త రాజ‌ధాని ఢిల్లీ మ‌హాన‌గ‌రంలో కాశ్మీర్‌ ముస్లింల‌పై మ‌రింత వివ‌క్ష పెరిగింది. హోటల్ అగ్రిగేషన్ సంస్థ ఓయో రూమ్స్ క్రింద ఉన్న ఓ ఢిల్లీ హోటల్, ఒక కాశ్మీరీ వ్యక్తి బుక్ చేసుకున్న రూమ్‌ని ఇవ్వ‌మంటూ మొఖం మీద చెప్పేసింది.

ఆధార్ కార్డ్‌తో సహా, గుర్తింపు ఐడీ ప్రూఫ్‌లను చూపించిన తర్వాత కూడా కాశ్మీరీ గుర్తింపు ఉంద‌ని చెప్పి ముందే బుక్ చేసుకున్న గ‌దికి చెక్-ఇన్ చేయనివ్వలేదు. ఎందుకుని అడిగితే.. హోట‌ల్ రిసెప్షన్‌లో ఉన్న మ‌హిళ తన య‌జ‌మానికి ఫోన్ చేసి, ఆ త‌ర్వాత ఢిల్లీ పోలీసులే కాశ్మీరీల‌కు రూమ్ ఇవ్వొద్ద‌ని ఆదేశాలు జారీ చేశారంటూ అబ‌ద్దం చెప్పింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. జమ్మూకశ్మీర్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ జాతీయ అధికార ప్రతినిధి నాసిర్‌ ఖుహమీ ఈ కేసును త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు.

కాగా, ఈ ఘ‌ట‌న‌పై నిన్న రాత్రి ఢిల్లీ పోలీసులు వరుస ట్వీట్లతో వివరణ ఇచ్చారు. ఢిల్లీలోని హోటళ్లకు అలాంటి ఆదేశాలు ఏమీ ఇవ్వలేదని స్ప‌ష్టం చేశారు. ఎవ‌రైనా ఉద్దేశపూర్వకంగా ఇలాంటి త‌ప్పిదాలు చేస్తే, జరిమానా విధిస్తామ‌ని ఢిల్లీ పోలీసులు ట్వీట్ చేశారు.

ఇక ఈ వీడియో వైరల్ అయిన వెంటనే ఓయో రూమ్స్ యాజ‌మాన్యం స‌ద‌రు ఢిల్లీ హోటల్‌ను త‌మ ప్లాట్‌ఫారమ్‌పై నుండి తొలగించింది. మా గదులు, మా హృదయాలు ఎల్లప్పుడూ అందరికీ తెరిచి ఉంటాయంటా వివ‌ర‌ణ ఇచ్చింది.

Tags:    

Similar News