Gyanvapi Survey : జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి కోర్టు కీలక తీర్పు

జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ మసీదు హిందూ దేవాలయంపై కట్టారని.. ఇప్పటికే అందులో దేవాలయం ఆనవాళ్లు ఉన్నాయని కొందరు కోర్టును ఆశ్రయించారు.

Update: 2024-01-31 10:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ మసీదు హిందూ దేవాలయంపై కట్టారని.. ఇప్పటికే అందులో దేవాలయం ఆనవాళ్లు ఉన్నాయని కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన కోర్టు.. మసీదు ప్రాంగణంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) చేత "శాస్త్రీయ పరిశోధన" ఆదేశించింది. దీంతో సర్వే చేపట్టిన ASI మసీదును దేశాలయంపైనే కట్టారని.. దీనికి తగు ఆనవాళ్లు లభ్యమైనట్లు వారు చేసిన సర్వే లో తెలిపారు. ఈ సర్వే ఆధారంగా చేసుకొని వారణాసి కోర్టు ఈ రోజు కీలక తీర్పును ప్రకటించింది.

మసీదులో సీజ్ చేసి ఉంచిన 10 సెల్లార్లలో ఉన్న దేవతల ప్రతిమలకు పూజలు చేసుకునేందుకు హిందువులకు, హిందుసంఘాలకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఇందుకు గాను వారం రోజుల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని వారణాసి కోర్టు ఆదేశించింది. కాగా ఈ తీర్పుపై హిందూ పిటిషనర్ల న్యాయవాది స్పందించారు. కోర్టు తీర్పు వారు కీలక మలుపుగా, వారణాసి కోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. దేవతలకు పూజలు చేసే హక్కు ప్రతి హిందువుకు ఉందని. పిటిషనర్ల తరుపు న్యాయవాది చెప్పుకొచ్చాడు.

Read More:   ‘ఇది హిందువుల అతిపెద్ద విజయం’.. జ్ఞానవాసీ మసీదు కేసుపై కాశీవిశ్వనాథ్ ట్రస్ట్ కీలక ప్రకటన

Tags:    

Similar News