డోర్ బెల్స్ కొడుతూ అక్కడ హడల్ పుట్టిస్తున్న అమ్మాయిలు!

ప్రస్తుత రోజుల్లో యువత సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు.

Update: 2024-01-31 10:00 GMT

దిశ, ఫీచర్స్: ప్రస్తుత రోజుల్లో యువత సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. రోడ్లపై, మెట్రో రైళ్లలో వింత చేష్టలతో తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. రీసెంట్ ‌గా ఓ ప్రేమ జంట స్కూటీపై స్పీట్ డ్రైవింగ్‌ చేస్తూ రొమాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అప్పటి వరకు ఆనందాన్నిచ్చే ఈ రీల్స్ కొన్నిసార్లు ప్రాణాల మీదకే తెచ్చుకున్నవారవుతారని నెట్టింట జనాలు వారిపై మండిపడుతూ కామెంట్లు చేశారు.

తాజాగా ఇద్దరు అమ్మాయిలు ఓ అపార్ట్‌మెంట్‌ భవనంలో ఉంటున్న కొంతమందిని ప్రాంక్ చేసి భయపట్టించారు. అర్ధరాత్రి బయట నుంచి బెడం వేసి డోర్ బెల్స్ మోగిస్తున్నారు. అలాగే తలుపులు తట్టడం, వెంటనే పారిపోవడం లాంటివి చేస్తున్నారు. ఈ ఘటన ముంబయిలో చోటుచేసుకుంది. ఈ విషయాన్ని శ్రేస్ట్ పొద్దార్ అనే యువకుడు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ.. ‘‘మేం నిద్రిస్తున్న టైంలో మార్నింగ్ 2.30 గంటలకు ఇద్దరు అమ్మాయిలు వచ్చి ప్రాంక్ చేశారు.పెద్ద శబ్దాల వల్ల మా అమ్మ నేను చాలా భయపడ్డాం.

సీసీ ఫుటేజ్ ఉంది. కానీ అది ఆఫ్‌లైన్‌లో ఉంది. విండోస్ నుంచి చూస్తే ఎవరూ కనిపించలేదు. మార్నింగ్ వేరే వారి దగ్గర సీసీటీవీలో చెక్ చేయగా.. ఇద్దరు అమ్మాయిలు కనిపించారు. మరుసటి రోజు వారిని తిట్టి పంపించాం. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని, పోలీసులకు కంప్లైంట్ చేయాలి.. గతంలో మా అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదాలు, దోపిడి, దొంగతనాలు జరిగాయని శ్రేస్ట్ చెప్పుకొచ్చారు.


Similar News