Gujarat : ‘మోర్బి బ్రిడ్జి’ కూలిన కేసు.. నిందితుడికి మోర్బీలోనే తులాభారం

దిశ, నేషనల్ బ్యూరో : గుజరాత్‌(Gujarat)లోని మోర్బిలో సస్పెన్షన్ వంతెన కూలి 135 మంది చనిపోవడానికి కారకుడైన పారిశ్రామికవేత్త జైసుఖ్ పటేల్‌(Jaysukh Patel)ను.. అదే మోర్బి పట్టణంలో ఘనంగా సన్మానించారు.

Update: 2024-11-17 19:35 GMT

దిశ, నేషనల్ బ్యూరో : గుజరాత్‌(Gujarat)లోని మోర్బిలో సస్పెన్షన్ వంతెన కూలి 135 మంది చనిపోవడానికి కారకుడైన పారిశ్రామికవేత్త జైసుఖ్ పటేల్‌(Jaysukh Patel)ను.. అదే మోర్బి పట్టణంలో ఘనంగా సన్మానించారు. 2022 అక్టోబరు 30న వంతెన కూలిన కేసులో జైసుఖ్ ప్రస్తుతం బెయిల్‌‌పై బయట ఉన్నారు. ఈనేపథ్యంలో పాటీదార్ వర్గం(Patidar community) ఆధ్వర్యంలో మోర్బి(Morbi district) పట్టణ శివారులో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జైసుఖ్ పటేల్‌ పాల్గొన్నారు. ఈసందర్భంగా పట్టణంలోని ఉమా శంకర్ ధామ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం జైసుఖ్ పటేల్‌‌‌తో పాటు పలువురు ప్రముఖులకు తులాభారం వేశారు. పెద్ద త్రాసులో ఒక వైపు పల్లెంలో జైసుఖ్ కూర్చోగా.. మరోవైపు పల్లెంలో దాదాపు 60వేల స్వీట్ బాక్సులు ఉంచారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ తులాభారంలో వాడిన స్వీట్ బాక్సులను పాటీదార్ వర్గం వారికి నిర్వాహకులు పంపిణీ చేశారు. మోర్బిలో విషాదానికి కారకుడైన వ్యక్తికి.. మోర్బిలోనే ఘన సత్కారం జరగడం తమకు ఆవేదన కలిగించిందని మోర్బి ఘటన బాధితుల సంఘం సభ్యుడు నరేంద్ర పర్మార్ తెలిపారు. 

Tags:    

Similar News