‘ది కేరళ స్టోరీ’ సినిమా చూసి ప్రియుడిపై రేప్ కేసు పెట్టిన ప్రియురాలు
హీరోయిన్ అదా శర్మ నటించిన ‘ది కేరళ స్టోరీ’ సినిమా మొదట పలు వివాదాలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
దిశ, వెబ్ డెస్క్: హీరోయిన్ అదా శర్మ నటించిన ‘ది కేరళ స్టోరీ’ సినిమా మొదట పలు వివాదాలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. మే 5న గ్రాండ్‌గా విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్లతో దూసుకెలుతోంది. అంతేకాకుండా పలువురి ప్రశంసలు అందుకుటోంది. తాజాగా, ఈ సినిమా ఓ ప్రేమ జంట మధ్య చిచ్చు పెట్టింది. తన ప్రియుడు మత మారాలని వేధిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ ప్రేమ జంట నాలుగేళ్లుగా కలిసి ఉంటున్నారు. యువతి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తుండగా.. యువకుడు 12వ తరగతి చదివి జాబ్ ప్రయత్నాల్లో ఉన్నాడు. అయితే ఇటీవల ఈ జంట ‘ది కేరళ స్టోరీ’ సినిమా చూశారు. ఇంటికి వెళ్ళాక ఇద్దరి మధ్య గొడవ చోటుచేసుకుంది. అది కాస్త పెరగడంతో ఆగ్రహంతో ఊగిపోయిన యువతి ప్రియుడి పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని, తనపై అత్యాచారం చేశాడంటూ బాయ్‌ఫ్రెండ్‌పై కేసు పెట్టింది. అంతేకాకుండా తనను ప్రియుడు మతం మార్చుకోవాలంటూ మానసికంగా వేధిస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు యువకుడి పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అతడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Also Read: పువ్వులా విచ్చుకున్న బ్లాక్ డ్రెస్‌లో టెంప్ట్ చేస్తున్న స్టార్ హీరోయిన్..