రాష్ట్ర భవిష్యత్ పైనే దృష్టి: హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖు

రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వింధర్ సింగ్ సుఖూ స్పందించారు. జరిగిందేదో జరిగి పోయిందని. ప్రస్తుతం రాష్ట్ర భవిష్యత్ పైనే దృష్టి సారిస్తామని తెలిపారు.

Update: 2024-03-25 10:33 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వింధర్ సింగ్ సుఖూ స్పందించారు. జరిగిందేదో జరిగి పోయిందని. ప్రస్తుతం రాష్ట్ర భవిష్యత్ పైనే దృష్టి సారిస్తామని తెలిపారు. సోమవారం సిమ్లాలో మీడియాతో మాట్లాడిన సుఖూ రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపపారు. 2032 నాటికి హిమాచల్ ప్రదేశ్‌ను అత్యంత ధనిక రాష్ట్రంగా మార్చడమే లక్ష్యమని వెల్లడించారు. గతంలో జరిగిన విషయాలను పట్టించుకోవడం అనవసరమని స్పష్టం చేశారు. ప్రజలకు అన్నీ తెలుసని దాని గురించి వారే చూసుకుంటారని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం దోహదపడుతుందని తెలిపారు. కాగా, కాంగ్రెస్ పార్టీ విప్‌ను ధిక్కరించినందుకు గాను ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. దీంతో వారితో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఇటీవల బీజేపీలో చేరారు. ఈ స్థానాలన్నింటికీ ఉప ఎన్నికలు జరగనున్నాయి. అయితే వాటిలో అత్యధికంగా బీజేపీ గెలిస్తే ప్రభుత్వం సంక్షోభంలో పడే అవకాశం ఉంది. 

Tags:    

Similar News