స్వలింగ వివాహాలకు చట్టబద్దత వద్దు!

స్వలింగ వివాహాల చట్టబద్దతను కేంద్ర ప్రభుత్వం మరోసారి వ్యతిరేకించింది. ఇలాంటి వివాహాలకు చట్టబద్దత ఇవ్వడం సరికాదని సుప్రీంకోర్టుకు తెలిపింది.

Update: 2023-04-17 09:57 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: స్వలింగ వివాహాల చట్టబద్దతను కేంద్ర ప్రభుత్వం మరోసారి వ్యతిరేకించింది. ఇలాంటి వివాహాలకు చట్టబద్దత ఇవ్వడం సరికాదని సుప్రీంకోర్టుకు తెలిపింది. స్వలింగ వివాహాలకు చట్టబద్దత కలిపించాలంటూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం విచారణ కొనసాగనుండగా ఈ లోపు సోమవారం కేంద్రం తన వాదనలను సుప్రీంకోర్టుకు సమర్పించింది. వీటిని గుర్తించడం వల్ల దేశవ్యాప్తంగా భిన్నమైన వివాహ సంస్థలు అనుభవిస్తున్న ప్రత్యేక హోదా మసకబారుతుందని పేర్కొంది.

ఏ మతం, ఉప మతం, కులం, ఉప కులం కూడా స్వలింగ వివాహాలను ఒప్పుకోవడం లేదని అందువల్ల ఇలాంటి వాటిని కోర్టు ఆమోదించవద్దని కేంద్రం కోరింది. ఆర్టికల్ 246 ప్రకారం సామాజిక సంబంధాలనేవి చట్టపరమైన సిద్ధాంతంలోని భాగమని కేంద్రం సుప్రీంకోర్టుకు గుర్తు చేసింది. కాగా, స్వలింగ వివాహాలకు చట్టబద్దత కల్పించాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై రేపు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వాదనలు విననుంది.

Read more:

అమర్‌నాథ్ భక్తులకు గుడ్ న్యూస్

Tags:    

Similar News